header

Cashew Apple….జీడి పండు....

జీడి పండ్లు జీడిచెట్లకు కాస్తాయి. జీడి చెట్లు ఎక్కువగా సముద్రతీర ప్రాంతాలలో ఇసుక నేలలలో పెరుగుతాయి. వీటికి కాసే పండ్లు పచ్చివిగా ఉన్నపుడు లేత ఆకుపచ్చగా ఉండి పండిన తరువాత ముదురు ఎరుపు, నారింజ పసుపు రంగులలో ఉంటాయి. ఈ కాయల అడుగు భాగంలో ఉండే గింజల నుండి జీడిపప్పును సేకరిస్తారు. ఇవి వేసవి కాలంలో కాస్తాయి.
పండిన జీడిపండును కొరికితే వగరు, తీపితో మంచి వాసనతో రసవంతంగా ఉంటాయి. ఈ పండ్లలో కొద్దిగా పిండి పదార్ధాలతో పాటు ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, విటమిన్-సి, పొటాషియం, పీచు సమృద్ధిగా ఉంటాయి. ఈ పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలూ ఎక్కువగా ఉంటాయి. ఈ పండ్ల జ్యూస్ ను జలుబుకి మందుగా వాడతారు. గొంతుమంట, అమీబిక్, డీసెంట్రీ వంటి వ్యాధులకి టానిక్ లా పనిచేస్తుంది.ఈ పండ్ల నుండి తీసిన రసాయనాలను సౌందర్య ఉత్పత్తులలో, క్యాన్సర్ల మందులలో వాడుతున్నారు.